Header Banner

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజయవాడ పర్యటన! కారణం ఇదే..!

  Tue Apr 29, 2025 15:42        Politics

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బుధవారం రోజు విజయవాడ వెళ్లనున్నారు.. బెజవాడలో జరగనున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహానికి హాజరు కాబోతున్నారు రేవంత్ రెడ్డి.. ఇక, విజయవాడ పర్యటన కోసం ఉదయం 9.15 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు.. ఉదయం 10.40 గంటలకు కానూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు.. ఉదయం 10.50 గంటల నుండి 11.30 గంటల వరకు అయన కల్యాణ మండపం నందు.. దేవినేని ఉమా కుమారుడు వివాహానికి హాజరై.. వధూవరులను ఆశీర్వదించనున్నారు.. విజయవాడ నుంచి తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి..

కాగా, గత వారం హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. తన కుమారుడు వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎంకు అందించి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.. మరోవైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. దేవినేని ఉమాతో సన్నిహితంగా ఉండేవారు.. ఆ తర్వాత పార్టీ మారి.. తెలంగాణ సీఎం అయినా.. వారి మధ్య స్నేహ బంధం కొనసాగుతోంది.. దీంతో, మిత్రుడి ఆహ్వానం మేరకు ఆయన కుమారుడి వివాహానికి హాజరుకాబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వివాహానికి హాజరు అయ్యే అవకాశం ఉండడంతో.. పెళ్లి వేడుకలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకునే అవకాశం లేకపోలేదు..


ఇది కూడా చదవండిమరో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TelanganaCM #RevanthReddy #VijayawadaTour #TelanganaPolitics #Vijayawada